కల్నల్ సంతోష్‌బాబుకు సిఎం కెసిఆర్‌ నివాళి

కుటుంబ సభ్యులను పరామర్శించిన సిఎం కెసిఆర్‌

cm-kcr-meets-colonel-santhosh-babu-family

సూర్యాపేట: సిఎం కెసిఆర్‌ కల్నల్ సంతోష్ బాబు నివాసానికి చేరుకున్నారు. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించిన సిఎం వారితో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. అంతేకాదు భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. దాంతో పాటు హైదరాబాాద్ నివాస స్థలానికి సంబంధించిన పత్రాలను సైతం స్వయంగా అందించారు. కల్నల్ సంతోష్ దేశం కోసం ప్రాణాలర్పించారని.. అలాంటి వీరుడిని ఇచ్చిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సిఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులు, ఇతర నేతలు ఉన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/