కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం.. 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బిజెపి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని బిజెపి సన్నాహాలు చేస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రచారాన్ని జోరు పెంచింది. ఈ క్రమంలో ప్రచారం కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపింది. దీనికి సంబదించిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కేబినెట్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ వంటి వారు ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో సహా ముగ్గురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.

అయితే.. ఈ జాబితాలో ప్రముఖల పేర్లు కనిపించలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, ప్రతాప్ సింహా, మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు ఈ జాబితాలో కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తేజశ్వి, సింహాలు హిందూత్వ రాజకీయాలకు ఫైర్‌ బ్రాండ్‌లుగా గుర్తింపు పొందారు. అలాంటివారు లేకపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఈ జాబితాలో తేజస్వి పేరు లేకపోవడంతో బెంగళూరులోని పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.