సిఎం జగన్ పై బుద్ధా విమర్శలు

రేనా చూడు రేనా చూడు అంటూ ట్విట్టర్ లో వ్యంగ్యం

Buddha venkanna
Buddha venkanna

అమరావతి: టిడిపి నేత బుద్ధా వెంకన్న వైఎస్‌ఆర్‌సిపి పై మరోసారి మండిపడ్డారు. చంద్రబాబును అనుకూల మీడియా కింద జాకీలతో, పైన క్రేన్లతో లేపుతోందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పబ్జీ ఆటకు పోతురాజు, పనిచేయడానికి తిమ్మరాజు అని సొంత ఎంపీనే సిఎం జగన్ ను విమర్శిస్తున్నారంటూ బుద్ధా ట్వీట్ చేశారు. ‘మీరేమో ట్వీట్లతో జాకీలేస్తూ, లేపి ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటారు… కానీ ఆయన తాడేపల్లి గడపదాటి రారు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఓ తెలుగు సినిమాలోని ప్యారడీ సాంగ్ ను కూడా బుద్ధా ట్వీట్ చేశారు. ‘రేనా చూడు రేనా చూడు ‘అంటూ సాగే ఆ పాటను విజయసాయిరెడ్డికి సంధించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/