నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

లుక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేడు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది.సభకు చీఫ్ గెస్ట్‌గా రాహుల్ గాంధీ రానున్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను ఏఐసీసీ మేనిఫెస్టోలో చేర్చింది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ భారీ బహిరంగ సభ మొదలుకాబోతుంది. ఇక ఈ సభకు 10 లక్షల మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సభ నేపథ్యంలోనే ఏకంగా 12 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి ఇది నిజామా కదా అనేది చూడాలి.

తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను ఏఐసీసీ మేనిఫెస్టోలో చేర్చింది. మేడారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంతో పాటు విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 మండలాలను తెలంగాణలో కలుపుతాం.. హైదరాబాద్‌లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయానికి హామీ ఇవ్వడం జరిగింది. వంద రోజుల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలను ప్రజలకు రేవంత్ వివరించనున్నారు.