కేంద్ర మంత్రి షెకావ‌త్‌తో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ : సీఎం కెసిఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ‌నివారం మ‌ధ్యాహ్నం కేంద్ర జ‌ల‌శక్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జ‌లాల పంపిణీపై 40 నిమిషాల పాటు చ‌ర్చించారు. 26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు.

అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/