పూరీ జగన్నాథుని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ

పూరీ జగన్నాథుని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ.. పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఒడిశా వెళ్లిన ఎన్​వీ రమణ..శనివారం పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. రమణకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ విశిష్టత గురించి అర్చకులను రమణ అడిగి తెలుసుకున్నారు.

“సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు మేము స్వాగతం పలికాము. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో వచ్చారు. ఈసారీ కుటుంబంతో కలిసి వచ్చారు. దర్శనం బాగా జరిగింది. దేవతలను వారు దర్శించుకున్నారు. మాకు దక్షిణం ఇచ్చారు. మేము ఆశిర్వాదం ఇచ్చాము. ఆలయ వ్యవహారాలపై ఆయన కొన్ని సూచనలు చేశారు. మేము కూడా చెప్పాల్సింది చెప్పాము. చాలా సంతోషంగా తిరిగి వెళ్లారని ఆలయ అర్చకులు తెలిపారు.