డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల

హైదరాబాద్: అర్హులైన పేదలకు పలుచోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లను కెసిఆర్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల ఆ ఇండ్ల నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం కోసం రూ. 150 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను బడ్జెట్ నిధుల నుంచి కేటాయించింది ప్రభుత్వం.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/