రేపు కరీంనగర్‌ సిఎం కెసిఆర్‌ పర్యటన

కరోనా చర్యలపై ఆరా

CM KCR
CM KCR

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటికే 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం. అందులోనూ ఒకేరోజు 8 కేసులు కరీంనగర్‌లో నమోదు కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కరీంనగర్‌ వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారు. ఈ మధ్య ఇండోనేషియా నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో పర్యవేక్షణ చర్యలలో భాగంగా రేపు సిఎం కెసిఆర్‌ కరీంనగర్‌ వెళ్ళనున్నారు. కెసిఆర్‌ వెంట పలువురు రాష్ట్రస్థాయి అధికారులు కూడా వెళ్లనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/