క్లోరోక్విన్ కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది

అజిత్రోమైసిన్ తో కలిపి తీసుకుంటే ఫలితం..వెల్లడించిన ట్రంప్‌

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ కు విరుగుడు మలేరియాను నిరోధించే క్లోరోక్విన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. తక్షణమే ఈ డ్రగ్ ను పెద్దఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ఇది దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గొప్పదనమని వ్యాఖ్యానించారు. యాంటీ బయాటిక్ అజిత్రో మైసిన్ తో కలిపి క్లోరోక్విన్ ను తీసుకుంటే, వ్యాధి బారిన పడిన వారిలో వైరస్ స్థాయి గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు. కాగా, క్లోరోక్విన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఇప్పటికే చైనా అధికారికంగా ప్రకటించింది. కొవిడ్ టీకా తయారీకి పెద్దఎత్తున జరుగుతున్న ట్రయల్స్ లోనూ కార్యకర్తలకు క్లోరోక్విన్ ను ఇస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, బెల్జియం తదితర దేశాలు కరోనాకు విరుగుడుగా ఇదే ఔషధాలను వాడుతున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/