మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ దే విజయంః కవిత

మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదన్న కవిత

kalvakuntla kavitha
kalvakuntla kavitha

హైదరాబాద్‌ః టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల వజ్రోత్సవాల నేపథ్యంలో నేడు హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ లో వన మహోత్సవ సంబరాలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా… టీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా… అభివృద్ధి ఆగలేదని చెప్పారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తుందని కవిత విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని చెప్పారు.

కాగా, మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీలో చేరబోతున్నారు. కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/