రైతు వేదికను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

cm kcr-rythu-vedika-inauguration

కొడకండ్ల: సిఎం కెసిఆర్‌ జనగామ జిల్లా కొడకండ్లలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కాగా కొడ‌కండ్ల‌కు చేరుకున్న సిఎం కెసిఆర్‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి ఆశీర్వ‌దించారు. అర్చ‌కుల మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య రైతు వేదిక శిలాఫ‌ల‌కాన్ని సీఎం ఆవిష్క‌రించారు. రైతులు పెద్ద ఎత్తున చ‌ప్ప‌ట్లు కొట్టి సిఎం కెసిఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. రైతు వేదిక అందుబాటులోకి రావ‌డంతో రైతులంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/