హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్ : హుస్సేన్‌ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు విచారణ జరిపింది. గణేష్ నిమజ్జనంపై నిర్ణయం వెల్లడికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. నిమజ్జనం నిర్ణయంతో పాటు పండగ సందర్భంగా జనం గుమిగూడకుండా ప్రభుత్వ చర్యలు తెలపాలని హైకోర్టు సూచించింది. గతేడాది ఆంక్షలు, నిబంధనల్లో సడలింపులు ఉండొద్దని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై విచారణ ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/