తెలంగాణ చరిత్రలోనేఅతి పెద్ద విదేశీ పెట్టబుడులు
రాష్ట్రంలో రూ.20,761 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

హైదరాబాద్: పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలంగాణలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రూ.20,761 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంగీకరించిందని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్ కార్యకలాపాలు 2022లో ప్రారంభం కానున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా కేబుళ్లు ఏర్పాటు చేయనుంది.
కాగా, నిన్న కెటిఆర్ పెట్టుబడులకు సంబంధించి మరో ప్రకటన కూడా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వన్‌ప్లస్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభమైందని అన్నారు. త్వరలోనే వన్‌ప్లస్ స్టోర్‌ను విజిట్ చేయనున్నట్లు తెలిపారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ నిన్న హైదరాబాద్‌లోని హియాయత్ నగర్ లో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. దీన్ని ‘వన్‌ప్లస్ నిజాం ప్యాలెస్’ పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/