రాష్ట్రంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ సిద్ధం.. సీఎం కేసీఆర్

kcr cabinet meeting updates
cm-kcr-high-level-review-on-the-situation-of-rains-and-floods-in-the-state

హైదరాబాద్‌ః రాష్ట్రంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్షనిర్వహించారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు పలు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాల్లో అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను సీఎం తెలుసుకుంటున్నారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్​ ఆరా తీస్తున్నారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/