నేడు నగరానికి ఉపరాష్ట్రతి రాక..ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions
Traffic restrictions

హైదరాబాద్‌: నేడు నగరానికి ఉపరాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించే దారిలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి బేగంపేట, పంజాగుట్ట, కేబీఆర్‌ పార్కు జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, రోడ్డు నం. 44 దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి పీఎన్‌టీ ఫ్లైఓవర్‌ మీదుగా నానక్‌రాంగూడకు చేరుకుంటారని తెలిపారు. ఆయన ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేయడం కానీ, మళ్లింపు కానీ చేపడుతామని అదనపు సీపీ వివరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/