పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ – పేర్ని నాని

మొదటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న మాజీ మంత్రి , వైస్సార్సీపీ నేత పేర్ని నాని మరోసారి విమర్శలు చేసారు. పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అని ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ తాజాగా జనవాణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం ప్రజల సమస్యలను జనవాణి కార్య క్రమం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేయగా..తాజాగా పేర్ని నాని స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘పక్షానికో సారి సెలవు రోజున పవన్‌కల్యాణ్‌ ప్రజాసేవ.. పవన్‌.. షూటింగ్‌లకే కాదు.. రాజకీయాల్లోనూ ఆలస్యమే. పవన్‌ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని పేర్ని నాని అన్నారు. 2024లో జగన్‌ను అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైస్సార్సీపీ ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని , జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని.. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.