జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలఫై జగన్ సమీక్ష

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం జగన్‌ ఆరా తీశారు. ఆప్షన్‌-3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు.. ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా పనులు, నిధులు మంజూరుచేసి పని పూర్తిచేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. అంతేకాదు గత సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఇంకా అవసరమైన చోట ల్యాండ్‌ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు. ఆప్షన్‌ –3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

ఈనెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్ల పట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పెద్దపీట వేయాలని చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని స్పష్టం చేశారు. కాలనీలో మనం నిర్మించేది ఇళ్లు కాదని..ఊళ్ల విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.

జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆదేశించారు. అలాగే డ్రైనేజీ, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలన్నారు. 90 రోజుల్లో పట్టాల పంపిణీపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు ఇంటి స్థలం చూపించడమే కాదు..దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. స్థలం, పత్రాలు ఇచ్చిన విషయాన్ని లబ్ధిదారుల నుంచి తెలుసుకోవాలన్నారు. ఈసమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, జోగి రమేష్, సీఎస్ సమీర్‌ శర్మతోపాటు గృహ నిర్మాణ శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.