బాలుయే నా వారసుడన్న ఘంటసాల

వార్తల్లోని వ్యక్తి- ప్రతి సోమవారం

SP Bala subrahmanyam
SP Bala subrahmanyam

మీ తర్వాత విూ వారసుడెవరని గానగంధర్వుడు ఘంటసాలను పత్రికల వారు అడిగారు. ఆయన రామకృష్ణ పేరు చెబుతారని చాలా మంది అనుకున్నారు.

కాని, ఘంటసాల బాలు పేరు చెప్పేసరికి ఎవ్వరూ ఆశ్చర్యపడలేదు. అది సహజమనుకున్నారు. ఆయన గానగంధర్వుడు.

ఆయన చరిత్ర ఆయన మాటలలోనే విందాం. ఎందువల్లనంటే, ఆయన పరిస్థితి ఈ వ్యాసం రాసే సమయంలో బహు విషమంగా ఉంది.

పుట్టుపూర్వోత్తరాలు

‘నా పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. నేను 1946 జూన్‌ 4న జన్మించాను. మాది నెల్లూరు. మా నాన్న శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారు. ఆయన మంచి హరికథలు చెబుతూ వచ్చే కానుకలతో సంభావనలతో మా కుటుంబాన్ని పోషించేవారు.
ఆయనకు నన్ను ఇంజినీరు చేయాలని వ్ఞండేది. నా కోసం, నా చదువ్ఞ కోసం విపరీతంగా శ్రమించేవారు. మా నాన్నగారే సంగీతంలో నాకు తొలి గురువు.

ఆరేళ్ల వయస్సులో

నేను కూడా చిన్నప్పుడు సంగీతం, నాటకాలలో నటన నేర్చుకున్నాను. నా ఆరేళ్ల వయస్సులో మా నాన్నగారు వేసిన ‘భక్తరామదాసు కొడుకుగా వేషం వేసి, మంచి పేరు సంపాదించాను. మా ఇంట్లో రేడియో లేకపోవడం వల్ల పక్కవారింట్లో రేడియో పాటల్ని వినేవాణ్ణి. చిన్నప్పటి నుంచి పాటవింటే చాలు, వెంటనే నేర్చుకునేవాణ్ణి. అది భగవత్కృపం.
పి.సుశీల, ఎస్‌.జానకి గార్లతో అప్పుడే పాడేవాడిని. అయితే చదువ్ఞను మాత్రం నిర్లక్ష్యం చేసేవాడిని కాదు.

ఇంజినీరింగ్‌ వరకు ఎప్పుడూ క్లాసు ఫస్టునేనే.

మా సైన్స్‌ మాస్టరు గారికి పాటలంటే చాలా యిష్టం. ఒకసారి మా కాళహస్తి స్కూలుకు రేడియో వచ్చింది. సైన్సు మాస్టరు నన్ను పిలిచి, నా పాట రికార్డు చేస్తామన్నారు.

నా ఆనందానికి అంతే లేదు! ‘భక్త ప్రహ్లాద సినిమాలో పి. సుశీలగారు ‘పాల కడలిలో శేష తల్పమున పవళించే దేవా! అన్న పాటపాడాను. అందరూ ఎందరో ఎంతో మెచ్చుకున్నారు.
కాళహస్తిలో చదువ్ఞతుండగా, మా గురువుగారు రాధాపతిగారు నా చేత రెండు నాటికలు వేయించారు. అందరూమెచ్చుకున్నారు.

ఎస్‌.జానకి మెచ్చుకోలు

గూడూరులోని ఒక సంస్థ నిర్వహించిన జానపద వాద్యసంగీత కార్యక్రమాల పోటీల్లో నేను ప్రతియేటా పాడేవాడిని. ప్రతిసారి బహుమతివచ్చేది.

ఒక సంవత్సరం ఈ పోటీలకు ఎస్‌. జానకిగారు న్యాయమూర్తిగా వచ్చారు. నాకు ద్వితీయ బహుమతిరాగా, నన్ను ప్రథమ బహుమతి పొందిన కుర్రవాడిని పిలిచి, ఆవిడ మైకు దగ్గరకు వెళ్లి, నిర్మోహమాటంగా ‘నేను అవతలివ్యక్తిని కించపరచడం లేదు కాని, నా దృష్టిలో న్యాయంగా ఇస్తే, ఫస్ట్‌ప్రైజ్‌ ఈ అబ్బాయికే ఇవ్వాలి.ఆ అబ్బాయికి రెండవ బహుమతి ఇవ్వాలి అన్నారు.

ఎస్‌. జానకే నా గురువు

ఆమె అలా ధైర్యంగా వేదికపై మాట్లాడటం నాకు చాలా ఆనందం, ధైర్యం కలిగించాయి. అప్పటి నుంచి గొప్పగాయనిగానే కాక, నాకు గురువుగా కూడా ఎస్‌.జానకిగారినే భావిస్తూ ఉంటాను.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/