రైతులకు తీపి కబురు తెలిపిన సీఎం కేసీఆర్

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంబిస్తున్నట్లు తెలిపి రైతుల్లో సంబరాలు నింపారు సీఎం కేసీఆర్. తొలి విడతలో 19 వేల కోట్ల రుపాయల రుణాల మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇది రేపటినుంచే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నోట్ల రద్దు, కరోనా కారణంగా రైతు రుణాల మాఫీ ఆలస్యం అయిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

కాగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా రూ. లక్ష రూపాయల రుణ మాఫీ అమలు కానుంది. బుధవారం అధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సిఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు.