భీమ్లా నాయక్ : రానా జోడి మారింది

దగ్గుపాటి రానా..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ మూవీ తాలూకా ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో పవన్ సరసన మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు సరసన ఐశ్వర్య రాజేష్ అనుకున్నారు కానీ ఆమె సినిమా నుంచి తప్పుకుందని, ఆమె పాత్రలో సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి(డేనియల్ శేఖర్)తో జత కట్టి, లీడర్, పవన్ కళ్యాణ్ సర్‌తో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అందమైన డెబ్యూ. ఈ సంక్రాంతి ఘనంగా జరగబోతోంది” అంటూ పోస్ట్ చేసింది సంయుక్త మీనన్. రానా పాత్రకి భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి ఉంటారు. రానా తండ్రిగా సముద్ర ఖని నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.