రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం: మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు

29 గ్రామాల ప్రజలు తమ భూములను త్యాగం చేశారని కితాబు

vasantha-nageswara-rao-praised-amaravati-farmers

అమరావతిః ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క అమరావతి రైతులకే దక్కుతుందని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 29 గ్రామాల రైతులు తమ భూములను త్యాగం చేశారని, వారికి జేజేలు పలుకుతున్నట్టు చెప్పారు.

రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని, అందరికీ అది అందుబాటులో ఉంటుందని అన్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండడం హర్షణీయమని అన్నారు. ఇందులో వివాదం ఏమీ లేదన్నారు. కమ్మవారు ఉన్న రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకపోవడం దారుణమని, అన్ని సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/