ప్రధాని మోడి కి సీఎం జగన్ లేఖ
AP CM Jagan letter to Prime Minister Modi
అమరావతి : సీఎం జగన్ ప్రధాని మోడి కి లేఖ రాశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించారని.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం లేఖలో పేర్కొన్నారు.
జులై నెలలో ప్రైవేట్ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. టీకా డోసులను ప్రభుత్వం సేకరించి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. ఈ విధానం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. కేబినెట్ సెక్రటరీ భేటీలో పలు రాష్ట్రాలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయని ఆయన గుర్తు చేశారు. డోసుల సరఫరాపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/