తెలంగాణలో కొత్తగా 987 కేసులు నమోదు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 987 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 130 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 102 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,362 మంది కరోనా నుంచి కోలుకోగా, 7 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 3,651 మంది కరోనాతో కన్నుమూశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,22,593 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,05,455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 13,487 మంది చికిత్స పొందుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/