బాలయ్య కోసం కథ సిద్ధం చేసే పనిలో కొరటాల ..

రైటర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ..2013 లో మిర్చి మూవీ తో డైరెక్టర్ గా మారారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి డైరెక్టర్ గా కొరటాల కు ఎంతో పేరు తెచ్చింది. ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య మూవీ చేస్తున్నారు. ఫిబ్రవరి 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే ఎన్టీఆర్ తో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆచార్య రిలీజ్ కాగానే ఎన్టీఆర్ మూవీ ని సెట్స్ ఫైకి తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమా తరువాత బాలకృష్ణతో ఒక సినిమా చేసే ఆలోచనలో కొరటాల ఉన్నారని తెలుస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఆయన బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. ఈ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఉంటుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ కథను బాలకృష్ణకి వినిపించారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.