పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు

లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు సంభవించింది. బ‌ర్క‌త్ మార్కెట్‌లో ఉన్న ఓ షాపులో సిలిండ‌ర్ పేలిన‌ట్లు తెలుస్తోంది. ఆ పేలుడు వ‌ల్ల స‌మీపంలో ఉన్న షాపుల‌న్నీ ధ్వంసం అయ్యాయి. ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. ఓ షాపులో ఉన్న సిలిండ‌ర్ పేల‌డం వ‌ల్ల ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. ప‌ది వాహ‌నాలు ద‌గ్ధం అయ్యాయి. అగ్నిమాప‌క సిబ్బంది పేలుడు ప్రాంతానికి చేరుకున్న‌ది.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/