రామ్ చరణ్ ఫై బాలీవుడ్ బాద్షా ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫై బాలీవుడ్ బాద్ షా , కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అభినందనలు కురిపించారు. చరణ్-ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనేక భాషల్లో అనేక దేశాల్లో ప్రదర్శమై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ఆస్కార్ రిమైండర్ జాబితాలోను చోటు దక్కించుకుంది. తుది నామినేషన్లకు ముందు ఘట్టమే రిమైండర్ జాబితా. ఈ నేపథ్యంలో, ఆస్కార్ అవార్డుపై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
దీనిపై బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ స్పందించారు. ఇంగ్లీషులో, ఇంగ్లీషు అక్షరాలతో తెలుగు పదాల ద్వారా తన భావాలను వ్యక్తీకరించారు. “మీ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ను భారత్ కు తీసుకువచ్చినప్పుడు ఒకసారి దాన్ని తాకే అవకాశం ఇవ్వండి” అంటూ ట్వీట్ చేశారు. “నా మెగా పవర్ స్టార్ థాంక్యూ సో మచ్” అని పేర్కొన్నారు. దీనికి రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు. “తప్పకుండా షారుఖ్ ఖాన్ సర్… ఒకవేళ మేం ఆస్కార్ గెలిస్తే అది భారతీయ సినిమాకు చెందుతుంది” అంటూ ట్వీట్ చేశారు.