హైదరాబాద్ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద చిత్రం నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.ఇప్పటికే చిత్రం తాలూకా ప్రమోషన్స్ సినిమా ఫై అంచనాలు పెంచాయి.

సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో సమంత టైటిల్ రోల్‌ని పోషించగా.. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. సమంతతో పాటు ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు నటించారు. ఇక రిలీజ్ సందర్బంగా హైదరాబాద్‌లోని ‘సుదర్శన్ 35 ఎంఎం థియేటర్’ వద్ద సమంత భారీ కటౌట్‌ని అభిమానులు ఏర్పాటు చేశారు. 2019లోనూ ఇలానే ‘ఓ బేబీ’ సినిమా రిలీజ్‌కి ముందు సమంత కటౌట్‌ని ‘దేవీ 70 ఎంఎం’ థియేటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.