ఏపీకి పెట్టుబడుల వెల్లువ..పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం

cm-jagan

అమరావతి ః విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్… 13 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వీటిలో మూడు కంపెనీలు ప్రారంభం కాగా, 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ చేసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులతో మొత్తంగా రూ.3008 కోట్ల పెట్టుబడులు, 7455 మందికి ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫుడ్‌ ప్రాససింగ్‌ పరిశ్రమల ద్వారా సుమారు 91 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని సీఎం జగన్ తెలిపారు.

ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారని, ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు పొడిగించిందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, ఆ తర్వాత విచారణ చేపట్టారన్నారు. సీఐడీ రెండు రోజులు ఆయనను కస్టడీకి తీసుకొని కూడా విచారించిందన్నారు. ఇప్పుడు మరోసారి కస్టడీ కోరుతున్నారని, అసలు ఆ అవసరం ఏముంది? అన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని, కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దుబే వాదనలు వినిపించారు. ఆ తర్వాత విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.