చంద్రబాబు వెనుక గజదొంగల ముఠా, దత్తపుత్రుడు ఉన్నారుః సిఎం జగన్‌

చంద్రబాబు హయాంలో స్కాములపై ఆలోచనలు జరిగాయని విమర్శలు

cm-jagan-targets-chandrababu-in-puttaparthi-meeting

అమరావతిః చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కీముల గురించి కాకుండా, స్కాముల గురించి ఆలోచనలు జరిగాయని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి భూముల స్కాం, ఇసుక స్కాం జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు వెంట గజదొంగల ముఠా, దత్తపుత్రుడు ఉన్నారని వ్యాఖ్యానించారు. తన కోసం, తన వెనుక ఉన్న గజదొంగల ముఠా కోసమే చంద్రబాబు అధికారం కోరుకుంటున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈరోజు పుట్టపర్తిలో సీఎం జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయంపై ఆయన ఎన్నడూ ఆలోచించలేదని సీఎం జగన్ అన్నారు.