సంక్రాంతి సెల‌వుల్లో మార్పులు చేసిన ఏపీ సర్కార్

Announcement in 10 days on PRC: CM Jagan
AP CM YS Jagan

సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని..ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ ను వాయిదా వేసిన ఏపీ సర్కార్..తాజాగా సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. గ‌తంలో సంక్రాంతి సెలవుల‌ను ఈ నెల 14, 15, 16 తేదీల‌లో ఉంటాయని ప్రకటించిన సర్కార్…ఇప్పుడు 13, 14, 15 తేదీల‌లో సంక్రాంతి సెలువులు ఉంటాయ‌ని తెలిపింది. ఈ తేదీల‌లోనే భోగీ, సంక్రాంతి, క‌నుమ పండుగులు ఉంటున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

ఇక రాత్రి కర్ఫ్యూ విషయంలో కూడా కొంత వ‌ర‌కు మార్పులు చేసింది. సోమవారం నుండి రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుండి 05 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ను ప్రకటించింది. కానీ సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించి ..కర్ఫ్యూను ఈ నెల 18 నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నైట్ క‌ర్ఫ్యూలో కేవ‌లం అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది.