వైద్య కళాశాలను ప్రారంభించిన సిఎం జగన్‌

cm-jagan-speech-vizianagaram-medical-college-inauguration

విజయనగరం: విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని సిఎం జగన్ సూచించారు. విజయనగరంలో వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంచి వైద్యులుగా సమాజానికి సేవ చేయాలన్నారు. రానున్న మూడేళ్లలో 17 మెడికల్ కాలేజ్ లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజ్ లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కేవలం నాలుగేళ్లలో 17 కాలేజ్ లు తెచ్చామని తెలిపారు.

17 మెడికల్ కాలేజ్ ల కోసం 8,440 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. 2,250 మెడికల్ సీట్లు అదనంగా రానున్నాయి. మారుమూల ఏజెన్సీలో కూడా మెడికల్ కాలేజ్ లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ నర్శింగ్ కాలేజ్ లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. మరో 18 నర్సింగ్ కాలేజిలు తీసుకొస్తున్నాం.పాత వైద్య కళాశాలలను నాడు నేడు లో అప్ గ్రేండ్ చెయ్యాలని భావిస్తున్నామని తెలిపారు. పీహెచ్ లో ఇద్దరు డాక్టర్ ఉండేలా..‌ గ్రామానికి నెలలో రెండు రోజులు వెళ్లేలా కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా వెయ్యి యాభై నుంచి ఇప్పడు మూడు వేల పై చిలుకు వ్యాధులకు సేవలు అందిస్తున్నాం.వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ కవర్ అయ్యేలా చర్యలు తీసుకున్నాం. రెండు వేల రెండు వందల కు ఆరోగ్య శ్రీ ఆసుపత్రి లు పెంచినట్టు వెల్లడించారు.

రెండు వేల రెండు వందల పైచిలుకు వాహనాలు తిరుగుతున్నాయని, యాభై ఆరువేలకు పై చిలుకు వైద్య సిబ్బందిని నియమించుకున్నాం.డీపీటీ పద్దతిలో నేరుగా లబ్దిదారునికి అందేలా చూస్తున్నాం. ముఫ్పై లక్షల ఇంటి స్థలాలను అందుస్తున్నాం..తొబ్బై ఎనిమిది లక్షల వివిధ రకాల సర్టిఫికేట్లను జగన్నన్న సురక్ష ద్వారా అందించాం. ప్రజలకు మీరు చెయ్యబోయే కార్యక్రమం మంచి వైద్యులుగా సేవలందించాలని సిఎం జగన్‌ సూచించారు.