జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలిః అచ్చెన్నాయుడు
స్పందించాలని ఎవరినీ అడగబోమని స్పష్టీకరణ

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంత వరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కూడా మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ… జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని చెప్పారు. పోయి ఆయననే అడిగితే సమాధానం చెపుతాడని, తనను అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు. స్పందించాలని తాము ఎవరినీ అడగమని చెప్పారు. జనసేనతో పొత్తుపై స్పందిస్తూ… రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టిడిపి చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని తెలిపారు.