కిందపడ్డ అచ్చెన్నాయుడు ..షాక్ లో టీడీపీ శ్రేణులు

శ్రీకాకుళం లో బాపూజీ కళామందిర్ లో సర్ధార్ శ్రీ గౌతు లచ్చన్న గారి ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా సోఫాలో కూర్చుంటూనే వెనక్కి వాలిపోయారు. ఆయనతో పాటు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కూడా కిందపడ్డారు.

ఈ ఘటన లో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న వాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. సోఫా విరిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్టయిన గన్‌మెన్లు వారిని పైకి లేపారు. ఆ తర్వాత యధావిధిగా పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది.