పంట నష్టంపై అధికారులతో సిఎం జగన్‌ సమీక్ష

CM Jagan reviews crop damage with officials

అమరావతిః సిఎం జగన్‌ ఏపిలో పంట నష్టంపై అధికారులతో సమీక్ష జరిపారు. వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలు త్వరగా సేకరించి, నివేదికను అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో సిఎం జగన్‌ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తీపికబురు అందించారు. మే నెలలోనే వైఎస్‌ఆర్ రైతు భరోసాతో పాటు పంట నష్టం జరిగిన వ్యవసాయదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అర్హతల గల రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి తనిఖీ పూర్తి చేయాలని పేర్కొన్నారు.

కాగా, ఇదిలాఉంటే.. వేసవి కాలంలో వర్షాకాలాన్ని తలపిస్తూ కురుస్తున్న వర్షాలతో అన్నదాత కంట కన్నీరు పెడుతున్నాడు. చేతికి అందివచ్చిన పంట నీటిలో తేలుతుదండంతో ప్రకృతి తమని కరుణించదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్న వేడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. అన్నదాతను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. చర్యలు తీసుకోవడం సీఎం జగన్ ప్రారంభించారు.