సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆసక్తి కరమైన దృశ్యం

గురువారం దేశ వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకులు అంబరాన్ని తాకాయి. అన్ని దేవాలయాల్లో ఉదయం నుండే భక్తుల తాకిడి మొదలైంది. కాగా కొన్ని చోట్ల పలు అపశృతి ఘటనలు చోటుచేసుకోగా..తెలంగాణలోని కొమురంభీం జిల్లాలో ఆసక్తి కరమైన దృశ్యం చోటుచేసుకుంది. కొమురంభీం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చాయో కానీ ఓ రెండు వానరాలు అనుకోని అతిధులుగా విచ్చేశాయి, సీతారామ కళ్యాణం జరుగుతున్నంత సేపు కదల కుండా కనులారా తిలకించాయి.

కళ్యాణ ముగిసిన అనంతరం.. పీట దగ్గరకు వెళ్లి వధూవరులైన సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న అక్షింతలను చేతిలోకి తీసుకొని.. వాటిని విగ్రహాలపై వేసి ఆశీర్వదించాయి. అనంతరం మరి కొన్ని అక్షింతలను, పండ్లు ఫలాలను నోట్లో వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన‌ భక్తులంతా రాములోరి కళ్యాణానికి హనుమంతుల‌ వారి సైన్యం వచ్చిదంటూ వారికీ నమస్కరించారు. దీనిని అంత కొంతమంది యువతీ , యువకులు తమ ఫోన్ లలో వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.