నేడు అసెంబ్లీ లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్..

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీ లో కీలక బిల్లులను ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టబోతోంది. కొద్దీ సేపటిక్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగా..ఈరోజు సభలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది.

అలాగే బుడగ జంగాల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయనుంది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.