తెలుగు సినిమా మఠానికి పీఠాధిపతి రాజమౌళి

‘ఆచార్య ‘ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి

Acharya Movie PreRelease event
Acharya Movie PreRelease event

లెజండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో , అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం’ ఆచార్య’. బ్లాక్ బర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వవహిస్తున్నారు.. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సందర్భంగా శనివారం రాత్రి యూసఫ్ గూడ లోని టి ఎస్పీ ఎస్పీ 1వ బెటాలియెన్ మైదానంలో అభిమానుల కోలాహలం మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు . ఇపుడు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు నిరూపించాయని అన్నారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి ఎంతైనా అభినంద నీయుడని అన్నారు.. రాజమౌళి మన తెలుగు వాడు కావటంమన అదృష్టమన్నాడు. భారతీయ సినిమా ఒక మఠం అయితే ఆ మఠానికి పీఠాధిపతి రాజమౌళి అని పేర్కొన్నారు..

అనంతరం రాజమౌళిని శాలువాతో ఘనంగా సత్కరించారు. చరణ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు . ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుందని అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, రాంచరణ్, పూజ హెగ్డే, రామజోగయ్య శాస్త్రి. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, తదితరులు మాట్లాడారు.

జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/