సీఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం
చిరంజీవితో కలిసి వెళ్లిన ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి
తాడేపల్లి సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో భేటీ

అమరావతి: టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి ఉన్నారు. నాగార్జున ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
సినీ ప్రముఖులను తాడేపల్లి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జీవో నంబరు 35లో సవరణలపై చర్చించనున్నారు. అలాగే, థియేటర్ల వర్గీకరణ, వాటిల్లో స్నాక్స్ అమ్మకాల ధరలు వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం సీఎంవో నుంచే ఓ ప్రకటన వస్తుందని చిరంజీవి మీడియాకు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/