తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి – పొంగులేటి

Ponguleti Sudhakar Reddy fire to kcr

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవట్లేదు కేసీఆర్ రాజ్యాంగమే నడుస్తుందని , రాహుల్ గాంధీ చేసే యాత్ర భారత్ జూడో యాత్ర కాదు కాంగ్రెస్ బచావో యాత్ర అని నిప్పులు చెరిగారు సుధాకర్ రెడ్డి. కేవలం టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల పైనే కాదు..కమ్యూనిస్టులు పార్టీలపై కూడా సుధాకర్ రెడ్డి పలు విమర్శలు చేసారు.కమ్యూనిస్టులు కమర్షియల్ ఇస్టులు అయ్యారని , కమ్యూనిస్టులు వ్యాపార సంస్థలుగా మారారని.. కమ్యూనిస్టులు , కమర్షియల్ల వల్ల కమర్షియల్ అఫ్ ఇండియా.. కమర్షియల్ అఫ్ మార్కస్ట్ గా అయ్యారని ఎద్దేవా చేసారు.

ఇక సెప్టెంబర్‌ 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో విమోచన దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా గౌరవ వందనం స్వీకరించనున్నారు. సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ విమోచనానికి లింక్‌ ఉండటంతో ఏక్నాథ్ షిండే, బసవరాజు బొమ్మైకు ఆహ్వానం కూడా పంపించారు. గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో.. వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బిజెపి నేతలు దగ్గర ఉండి పరేడ్‌ గ్రౌండ్స్‌లో కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.