దేశంలో కొత్తగా 67,084 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 5,06,520

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ క్రమంలో నిన్న దేశంలో 67,084 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, నిన్న‌ 1,67,882 మంది కోలుకున్నార‌ని చెప్పింది. నిన్న దేశంలో క‌రోనాతో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది.

దేశంలో ప్ర‌స్తుతం 7,90,789 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారని వివ‌రించింది. మృతుల సంఖ్య మొత్తం 5,06,520కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,71,28,19,947 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/