హైదరాబాద్ లో కుప్పకూలిన ఫ్లైఓవర్..

హైదరాబాద్ లోని ఎల్ బినగర్ సాగర్ రింగు రోడ్డు లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలింది. పిల్లర్ టూ పిల్లర్ కు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఒక్క సారిగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రాత్రి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలుస్తోంది.

ఈ సంఘటన ప్రాంతానికి ఎల్బీ నగర్ ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ… మలుపు ఉండడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందని…ఇంజనీర్ల విభాగం సంబంధించిన అధికారులను సంఘటన స్థలానికి పిలుస్తున్నామన్నారు. వాళ్లు వచ్చిన తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు.