ప్రభాస్ డైరెక్టర్ తో గాలోడు..?

sudigali-sudheer-next-movie-under-dasharath-direction

గాలోడు మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్..త్వరలో ప్రభాస్ డైరెక్టర్ డైరెక్షన్లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షో తో పాపులర్ యినా సుధీర్..ఆ తర్వాత పలు షోస్ కు యాంకర్ గా చేసి అలరించాడు. ఇదే క్రమంలో వరుస సినిమా ఛాన్సులు రావడం తో మరింత బిజీ అయ్యాడు. త్రీ మంకీస్‌, వాంటెడ్‌ పండుగాడు వంటి సినిమాల్లో హీరోగా చేసిన అవి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే గతేడాది ఆయన నటించిన గాలోడు రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర కమర్షియల్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో సుధీర్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు , దర్శకులు పోటీ పడుతున్నారు.

ఈ క్రమంలో సంతోషం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తెరకెక్కించిన దశరథ్‌తో సుధీర్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని తెలుస్తుంది. ఇక దశరథ్ కొంత కాలంగా లైమ్‌ లైట్‌లో లేడు. ఏడేళ్ల క్రితం వచ్చిన శౌర్య మూవీ దశరథ్‌కు చివరి సినిమా. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే చాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఈ సినిమా సుధీర్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇక సుధీర్‌కు జోడీగా పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబదించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.