బైడెన్‌పై విమర్శలు అన్యాయం: ఇమ్రాన్ ఖాన్

బైడెన్ తీసుకున్నది సున్నితమైన నిర్ణయం..పాక్ ప్రధాని

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను వెనక్కు తీసుకెళ్లాలనే నిర్ణయం వల్ల యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ విమర్శలపాలయ్యారు. ఆయన మద్దతుదారులు కూడా చాలామంది ఈ నిర్ణయాన్ని సమర్థించలేకపోయారు. ఈ క్రమంలో బైడెన్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా నిలిచారు. బైడెన్‌పై విమర్శలు చేస్తున్న వారిని ఇమ్రాన్ తప్పుబట్టారు. బైడెన్ నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ సమర్థించారు.

‘‘బైడెన్ తీసుకున్నది అత్యంత సున్నితమైన నిర్ణయం. ఈ విషయంలో ఆయనపై చాలా అన్యాయమైన విమర్శలు వచ్చాయి’’ అని పాక్ ప్రధాని చెప్పారు. కాగా, ఇటీవల ఆఫ్ఘన్ యుద్ధం గురించి ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 20 ఏళ్లలో పాకిస్థాన్‌ను అమెరికా వాడుకుందని విమర్శించారు. ‘20 ఏళ్ల ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికా తమను ఒక కిల్లర్‌ (హైర్డ్ గన్)లా వాడుకుంది’ అని పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/