స్వీయ నిర్బంధంలో కోహ్లీ దంపతులు

అందరూ స్వీయ నిర్బంధం విధించుకోవాలంటూ పిలుపు

Coronavirus quarantine Anushka Sharma and Virat Kohli
Coronavirus quarantine Anushka Sharma and Virat Kohli

ముంబయి: దేశంలో కరోనా నియంత్రణకు ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని, తాము కూడా స్వీయ నిర్బంధం విధించుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. దీనికి కోహ్లీ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని… వైరస్ ను అడ్డుకోవడానికి ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని ఈ సెలెబ్రిటీ దంపతులు పిలుపునిచ్చారు. అందరి క్షేమం కోసం తామిద్దరం స్వీయ నిర్బంధం విధించుకున్నామని… ప్రజలంతా ఇదే మాదిరి స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరారు. ప్రధాని మోడి పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ గురించి కూడా కోహ్లీ స్పందించాడు. ప్రధాని చెప్పనట్టు ప్రజలంతా ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లోనే ఉండాలని రాట్‌ కోహ్లీ విన్నవించాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/