తగ్గిన వారికి మళ్లీ సోకుతున్న కోవిడ్‌-19

చైనాలో మరింత పెరిగిన ఆందోళన

Covid-19 Infected Again in china
Covid-19 Infected Again in china

చైనా: సుమారు రెండు నెలల క్రితం వూహాన్ ప్రావిన్స్ లో వెలుగులోకి వచ్చిన కరోనా (కొవిడ్ 19) వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఎంతగా ఆందోళనకు గురి చేస్తున్నదో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ ఇప్పటికే 60 దేశాలకు పైగా వ్యాపించింది. వేలాది మందిని బలిగొంది. లక్షలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పటికే సుమారు 350 లక్షల కోట్ల నష్టం సంభవించిందని అంచనా. ఇప్పుడు కరోనా వైరస్ గురించి బయటకు వచ్చిన మరో వార్త తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఈ వైరస్ సోకి, చికిత్స తీసుకుని బయటకు వెళ్లిన వారికి తిరిగి వ్యాధి సోకుతోంది. డిశ్చార్జ్ అయిన వారు, రెండోసారి ఇన్ఫెక్షన్ గురై ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకూ ఇదే తరహా కేసులు 10 నమోదయ్యాయి. వీరందరూ వూహాన్ ప్రావిన్స్ పరిధిలోని వారే. దీంతో వూహన్ లో ప్రజల ఆందోళన మరింతగా పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/