మెగాస్టార్ – హైపర్ ఆది ల మధ్య అదిరిపోయే కామెడీ ఉండబోతుందట

వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు గా పూర్తైంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల ను యూనిట్ శరవేగంగా జరుపుతోంది. ఈ మూవీ మూవీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’కు రీమేక్ గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి మెహర్ రమేష్ రూపొందిస్తున్నాడు.

ఇక ఈ మూవీ లో కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. హైపర్ ఆది, వెన్నెల కిశోర్, సత్య వంటి మంచి యంగ్ కమెడియన్స్ ఇందులో నటిస్తున్నారు. మూవీ లో చిరంజీవి తన గ్యాంగ్లో ఉన్న హైపర్ ఆది పై పంచుల వర్షం కురిపించి ఝలక్ లు ఇవ్వబోతున్నారని సమాచారం. ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల ను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. అలాగే వెన్నెల కిశోర్ సత్య లతో చిరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయనే అంటున్నారు.

ఇక ఈ మూవీ లో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.