తెరాస నేతలకు ఫైన్ వేసిన బల్దియా అధికారులు

తెరాస నేతలకు షాక్ ఇచ్చారు బల్దియా అధికారులు. రీసెంట్ గా తెరాస ప్లినరీ సమావేశం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో తెరాస నేతలు హైదరాబాద్ అంత భారీ ప్లెక్సీ లతో నింపేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే నగరంలో ప్లెక్సీ లు ఏర్పటు చేయకూడదనే నింబంధలు ఉన్నాయి. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే వారికీ జరిమానాలు విధిస్తుంటారు అధికారులు.

తాజాగా తెరాస నేతలకు భారీగా జరిమానా విధించారు అధికారులు. రాత్రి 9 గంటల వరకు రూ.10 లక్షలకుపైగా చలానాలు జనరేట్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని, ట్విటర్‌ పోస్టుల ఆధారంగా జరిమానాలు వేస్తామని చెప్పారు. కాగా, అత్యధికంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3.10 లక్షలు, తర్వాత పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌కు రూ.1.50 లక్షలు ఫైన్‌ విధించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి రూ.65 వేలు, కార్మిక మంత్రి మల్లారెడ్డికి రూ.10 వేలు జరిమానా వేశారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకూ జరిమానా వేశారు.