తారకరత్న కోలుకుంటున్నాడనే మాట ఉపశమనాన్ని ఇచ్చిందన్న చిరంజీవి

తారకరత్న త్వరగా కోలుకొని ..మళ్లీ అందరి మధ్య సంతోషం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు తారకరత్న ఆరోగ్యం ఫై స్పందించగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేసారు.

సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆయన త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పారు. తారకరత్నను ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ‘డియర్ తారకరత్న నీకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి’ అని ఆకాంక్షించారు.

శుక్రవారం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. గత మూడు రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషయంగానే ఉందని
డాక్టర్స్ తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్స్ స్పష్టం చేశారు. తారకరత్నకు ఎలాంటి ఎక్మో పెట్టలేదని.. మీడియా లో ప్రచారం అవుతున్న దాంట్లో నిజం లేదని డాక్టర్స్ తేల్చి చెప్పారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.