ఇచ్ఛాపురంలో కుప్పకూలిన బహుదా బ్రిడ్జి

bahuda-bridge-collapse-in-ichapuram

ఇచ్ఛాపురం: ఏపిలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బహుదా నదిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో గ్రానేట్‌ లోడుతో వెళ్తున్న ఓ లారీ బ్రిడ్జిపైకి రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వంతెన కూలిన సమయంలో బ్రిడ్జిపై మరే వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

కాగా, సామార్థానికి మించిన లోడుతో వెళ్లడంతోనే బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు తెలిపారు. లారీ సుమారు 70 టన్నుల బరువుందని, బ్రిడ్జికి నదికి మధ్య 20 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. 1929లో నిర్మించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.