పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్ సమావేశాల(Union Budget 2023)కు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ప్రారంభించారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము.. లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి.
కాగా, రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి దిగువ సభలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గురువారం నుంచి ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది.